Header Banner

తిరుమల శ్రీవారి భక్తులకు అదిరిపోయే శుభవార్త..! అక్కడ నుండి ప్రయాణం ఉచితం!

  Mon May 05, 2025 11:43        Devotional

కలియుగ ప్రత్యక్ష దైవం, ఏడుకొండల పైన కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి నిత్యం వేలాది సంఖ్యలో భక్తులు తిరుమలకు తరలి వెళుతూ ఉంటారు. అటువంటి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయం వద్ద అన్ని మౌలిక వసతులు కల్పిస్తూ టిటిడి భక్తులకు స్వామి దర్శన భాగ్యాన్ని కల్పిస్తోంది. అయితే మరింత మెరుగైన వసతులను కల్పించడానికి ప్రయత్నాలు చేస్తున్న టిటిడి తిరుమల శ్రీవారి భక్తులకు తాజాగా శుభవార్త చెప్పనుంది.

భక్తుల సౌకర్యం కోసం టీటీడీ కొత్త ఆలోచన
తిరుమలకు వచ్చే భక్తులు తిరుపతి నుంచి అలిపిరి, శ్రీవారి మెట్టు దగ్గరకు వెళ్లాలంటే ఆర్టీసీ బస్సులను, ఆటోలను, లేదా క్యాబ్ లను ఆశ్రయించవలసి వస్తుంది. దీంతో భక్తులు జేబులు గుల్ల అవుతున్నాయి. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకున్న టిటిడి భక్తులకు ఆర్థికంగా ఇబ్బంది కలిగిస్తున్న ఈ సమస్య నుంచి పరిష్కారం కోసం కొత్త ఆలోచనలు చేస్తుంది.

అక్కడ నుండి ఉచిత బస్సులు
తిరుపతి రైల్వే స్టేషన్, ఆర్టీసీ బస్టాండ్ నుంచి కాలినడకన వెళ్లే భక్తుల కోసం ఆ మార్గాల వరకు టీటీడీ ఉచిత బస్సులను నడపాలని నిర్ణయించినట్లుగా సమాచారం.తిరుపతి నుంచి కాలినడకన తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి వెళ్లే సామాన్య భక్తుల సౌకర్యార్థం టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మార్గంలో కొత్తగా 20 ఎలక్ట్రిక్ బస్సులను నడప నున్నట్టు తెలుస్తోంది.

ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేసే యోచన
ఈ బస్సులలో తిరుపతిలోని రైల్వే స్టేషన్ నుండి, అలాగే బస్టాండ్ నుండి కాలినడక ద్వారా వెళ్లే భక్తులను అలిపిరి మీదుగా, శ్రీవారి మెట్టు వరకు ఉచితంగా తీసుకువెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఇప్పటికే టిటిడి ఆధ్వర్యంలో ఉచిత ధర్మ రథం బస్సులను ఏర్పాటు చేశారు. అయితే అవి భక్తుల రద్దీకి తగినట్లుగా లేకపోవడంతో మళ్ళీ త్వరలో పాలకమండలి సమావేశంలో ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేయడానికి నిర్ణయం తీసుకుంటారని సమాచారం.

దాతల సహకారంతో ఉచిత బస్సులను నడిపే ప్లాన్
టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు ఈ మేరకు సమాలోచనలు జరుపుతున్నట్లు, దాతల సహకారంతో ఈ మార్గాలలో ఉచిత బస్సులను నడపడానికి ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఏది ఏమైనా దీనిపైన అధికారకంగా ప్రకటన ఇప్పటివరకు వెల్లడి కాలేదు. ఒకవేళ ఇదే కనుక జరిగితే ఈ నిర్ణయం భక్తులకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది. వారిపైన ఆర్థిక భారాన్ని కాస్త తగ్గించినట్లు అవుతుంది.


ఇది కూడా చదవండి: జగన్ కు కొత్త పేరు పెట్టిన కూటమి నేతలు! అంతా అదే హాట్ టాపిక్!


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

షాకింగ్ న్యూస్: జగన్ హెలికాప్టర్ ఘటన దర్యాప్తు వేగవంతం! 10 మంది వైసీపీ కార్యకర్తల అరెస్ట్!

 

నెల్లూరు రూరల్ అభివృద్ధి అద్భుతం.. 60 రోజుల్లోనే 339 అభివృద్ధి పనులు పూర్తి! మంత్రి ప్రశంసలు

 

పాన్ ఇండియన్ సోషియో కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో.. జాతీయ సాంస్కృతోత్సవ పురస్కార వేడుక!

 

ఏపీ యువతకు గుడ్ న్యూస్.. యునిసెఫ్‌తో ప్రభుత్వం ఒప్పందం.. 2 లక్షల మందికి లబ్ధి!

 

అడ్డంగా బుక్కైన ప్రపంచ యాత్రికుడు అన్వేష్.. పోలీస్ కేసు నమోదు.. ఏం జరిగిందంటే?

 

జైలులో మాజీమంత్రి ఆరోగ్య పరిస్థితి విషమం! ఆసుపత్రికి తరలింపు..!

 

ఏపీ ప్రజలకు శుభవార్త! రూ.3,716 కోట్లతో.. ఆ రూట్లో ఆరు లైన్లుగా నేషనల్ హైవే!

 

సంచలన నిర్ణయం తీసుకున్న OYO హోటల్స్.. మరో కొత్త కాన్సెప్ట్‌తో - ఇక వారికి పండగే..

 

నిరుద్యోగులకు శుభవార్త.. నెలకు రూ.60 వేల జీతం.. దరఖాస్తుకు మే 13 చివరి తేదీ!

 

ఇక బతకలేను.. నా చావుకు కారణం వాళ్లే! ఢీ ఫేమ్ జాను కన్నీటి వీడియోతో కలకలం!

 

ఏపీలో చిన్నారులకు తీపికబురు - 18 ఏళ్ల వరకు ప్రతి నెలా రూ.వేలు! ఈ పథకం గురించి తెలుసాదరఖాస్తు చేస్కోండి!

 

నేడు (5/5) తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘ప్రజా వేదిక’ కార్యక్రమం! పాల్గొననున్న నాయకుల షెడ్యూల్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #Tirumala #Tirupati #FreeTravel #DevoteesDelight #TirumalaNews #TTDUpdates #SpiritualJourney #GoodNews